Kadiyam Srihari : జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…
KTR: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు తిరుగాయని, నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైనే…
1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు: సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ…
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్…
ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.
Padi Kaushik Reddy: తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. సంక్రాంతి పండగ సందర్భంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తనను దూషించడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు…
టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది: వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్…
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.