Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines At 9pm On 28th January 2025

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌!

Published Date :January 28, 2025 , 9:25 pm
By Sampath Kumar
Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం:
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్‌ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం అని పేర్కొన్నారు.

ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లెలిని చంపిన అన్న:
డబ్బు.. మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. పైసల కోసం సొంత వ్యక్తులను కూడా కడతేర్చుతున్నారు. గతంలో రైతుబీమా డబ్బు కోసం కన్న తల్లిని కొడుకు కడతేర్చిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపేశాడు. యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేసి.. పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ్గా.. చాలా ఆలస్యంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Also Read

  • Suvendu Adhikari: "సువేందు అధికారి అనే నేను".. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
  • Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
  • Norovirus Outbreak: క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
  • Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్‌లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
Add as a preferred
source on google

చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ:
అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్‌ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న క్రీడాసక్తిని, కల్చరల్ స్కిల్స్‌ను గుర్తించి.. వారు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, గురువులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటినీ నెలకొల్పుతున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఏకాంతంగా ప్రేమికులు.. తండ్రి ఎంత పనిచేశాడంటే.?
హనుమకొండ నగరంలోని గోపాల్‌పూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి వచ్చాడు భరత్ అనే యువకుడు. తన ఇంట్లో కూతురుతో యువకుడిని చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. బాలిక తండ్రి యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో.. బాలిక తండ్రి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. యువకుడు భరత్ గొంతు కోశాడు బాలిక తండ్రి. ప్రియుడి గొంతు కోయడం చూసి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు.. దాడి ఘటనలో యువకుడు భరత్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. బాలిక మృతదేహం ఎంజీఎం మార్చురీలో ఉంది. కాగా.. అబ్బాయి తండ్రి ఎల్ఐసి ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అమ్మ అంగన్వాడి టీచర్.. భరత్ కుటుంబం పోచమ్మ మైదాన్‌లో నివాసముంటుంది. యువకుడు భరత్ హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి తండ్రి హన్మకొండలో ఓ ప్రైవేట్ చిట్ ఫండ్‌లో పని చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బుజ్జగింపు రాజకీయ నాయకుల పవిత్ర స్నానాలు:
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు. సనాతనాన్ని నమ్మని, కేవలం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే వారు బలవంతంగా స్నానం చేయవలసి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆదివారం అఖిలేష్ యాదవ్ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని సంగమ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అఖిలేష్ యాదవ్ పుణ్యస్నానం చేసిన తర్వాత తన తండ్రి విగ్రహానికి పూలమాల వేశారు. దీనిపై యోగి మాట్లాడుతూ.. కొందరు మహాకుంభ్ ప్రాముఖ్యతను గుర్తించి ప్రముఖల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని, మనం ఈ విశ్వాసాలను విస్మరిస్తే, విశ్వాసాలు మనల్ని విస్మరిస్తాయని యోగి అన్నారు.

విమానంలో మంటలు.. ఆర్పేసిన ఫైర్ సిబ్బంది:
దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటకు దించేశారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. దక్షిణ కొరియాలోని ఎయిర్ బుసాన్‌కి చెందిన విమానం గిమ్‌హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. విమానం తోక భాగం నుంచి మంటలు చెలరేగాయి. విమానంలో 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. మంటలు అంటుకోగానే విమానం మొత్తం ఖాళీ చేయించారు. అయితే ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వ్యక్తిని అస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం లోపల మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం తోకలో ప్రారంభమైందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల మువాన్ ఎయిర్‌పోర్టులో జెజు ఎయిర్ విమానం కూలిపోయి 179 మంది మరణించారు. ఇంతలోనే మరో విమానం సంభవించడం కలవరపెడుతోంది.

పుతిన్‌ని చంపాలని ప్రయత్నించారు:
ఫాక్స్ న్యూస్‌కి చెందిన మాజీ ఉద్యోగి టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, టక్కర్ తన వాదనల్ని నిరూపించేలా ఎలాంటి ఆధారాల గురించి చెప్పలేదు. ‘‘ది టక్కర్ కార్ల్‌సన్ షో’’ తాజా ఎపిసోడ్‌లో కార్ల్‌సన్, అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ మాట్ తైబ్బితో సంభాషించారు. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ నిజమైన యుద్ధం కోసం చాలా కష్టపడ్డారని, పుతిన్‌ని చంపడానికి యత్నించారని, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పుతిన్‌ని చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఒకవేళ పుతిన్ హత్యకు గురైతే, రష్యాని ఎవరు స్వాధీనం చేసుకునేవారు..? సంక్లిష్టమైన దేశంలో అణ్వాయుధ సామాగ్రికి ఏం జరుగేది..? అంటూ కార్ల్‌సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పందించలేదు. కానీ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. పుతిన్ భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు:
నానాటికి బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాదం, ఉగ్రవాద భావాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి మహ్మద్ యూనస్ ప్రభుత్వం, పాకిస్తాన్‌తో చెలిమి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి సైనిక సాయాన్ని కోరుతోంది. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వీరు భారత సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి పాక్ ఆర్మీ అధికారులతో భేటీ అవుతున్నారు.

‘తల’లు తెగే ఉత్కంఠ.. ఏమన్నా ఉందా ట్రైలర్?:
టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకుంటున్న ‘తల’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ పరిశీలిస్తే అమ్మ రాజశేఖర్‌‌కు కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలుస్తుందనేలా ఉంది. దీప ఆర్ట్స్ పతాకంపై పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధ రాజశేఖర్ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కూడా ఈ సినిమాకి పని చేశారు.

రీమేకులపై కన్నేసిన అల్లరి నరేష్?
ఈమధ్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భిన్నమైన కంటెంట్తో రావడంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొడతాడని నమ్మకంతో వచ్చినా, ఆ సినిమా ఎందుకు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమాల మీద కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇస్తూ మంగళవారం నాడు అల్లరి నరేష్ సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఒక సూపర్ హిట్ తమిళ సినిమాని చూసినట్లుగా తెలుస్తోంది.

అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి:
రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. సిరీస్ పై గురిపెట్టిన టీమిండియా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లీష్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • ntv news
  • telangana news
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్‌ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!

  • Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!

  • Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?

  • Norovirus Outbreak: క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత

  • Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్‌లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions