నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…
దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు: మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే…
మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు: మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల…
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. బెజవాడలో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు నారా భువనేశ్వరి హాజరుకానున్నారు. సీఐడీ నోటీసుపై స్టే ఇవ్వాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.…
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది: గవర్నర్ ప్రసంగం, బడ్జెట్పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ..…
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ…
ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మండలిలో టీడీపీ, సభ్యుల మాటల యుద్ధం…
నాపై ఆరోపణలు చేస్తే మీ ఇంటికొస్తా: వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్…
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం: గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు.…