నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు ఆదరించింది. ‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన…
మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు. ఉదయం నుంచి కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి.
"పిల్లల్ని నేను కిడ్నాప్ చేయలేదు.. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం.. లక్ష రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం.. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్లకు వారిని అమ్మి సొమ్ము చేసుకున్నాం. ఒక్కొక్క పిల్లాడికి ఐదు నుంచి పది లక్షల రూపాయలుకు అమ్మివేశాం.. మేము కిడ్నాపర్లం కాదు. కేవలం పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ మాత్రమే అమ్మినం.." ఇది పసి పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న నిందితుల వాదన.
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు.
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు: మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని…
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్: ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10…
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది. నేడు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అప్పులు, ఉపాధ్యాయ పోస్టులు, వైజాగ్ టీడీఆర్ బాండ్లు, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు అంశాలపై సభ్యుల ప్రశ్నలు ఆగడనున్నారు. నేడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్…