నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధులు హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఒప్పందం పూర్తయిన తర్వాత హడ్కో నిధులు విడుదల చేయనుంది.
నేడు భారత స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి. ఈ సందర్భంగా రాజకీయా నాయకులు నివాళులర్పించిచారు.
సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరా నిఘాలో 164 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 30 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.
ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు కార్యక్రమాలలో మంత్రి సవిత పాల్గొననున్నారు.
బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో నేడు అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళ హారతి, ప్రత్యేక పూజలు, చీరే సారే బోనాలను భక్తులు సమర్పించనున్నారు.
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోని ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పరిశీలించనున్నారు. రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సీఎం చేయనున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు తన నట జీవితంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు మోహన్ బాబు పిలుపునిచ్చారు. నేటి సాయంత్రం రంగంపేటలో ఎడు గంటలకు విందు ఎర్పాటు చేసినట్లు మోహన్ బాబు నోట్ ద్వారా తెలిపారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరగనుంది. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా ఆధ్వర్యంలో వెస్టిండీస్ మాస్టర్స్ తలపడనున్నాయి.