Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని…
Union Minister Kishan Reddy: ఏడాది పాటుగా పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని కొనియాడారు. తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ నచ్చుతుందని విమర్శించారు.కాంగ్రెస్ కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే…
Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది..
Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార…
CM Revanth Reddy: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన…
Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ…
Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం…
Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్,…
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ లో ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే…