ESI Hospital Tragedy: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో జరిగిన భయానక ప్రమాదం కలకలం రేపింది. ఆసుపత్రిలో కొనసాగుతున్న రెనోవేషన్ పనుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ ఆకస్మికంగా కుప్పకూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..
రెనోవేషన్ పనుల కోసం ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక లిఫ్ట్‌లో ఐదుగురు కార్మికులు ఉండగా, వారు మార్బుల్ షీట్లను కూడా కలిసి పై అంతస్తుకు తీసుకెళ్తున్నారు. లిఫ్ట్‌పై అధిక లోడ్ పడడంతో పైకి వెళ్లిన కొద్దిసేపటికే లిఫ్ట్ వైరు తెగి ఒక్కసారిగా కిందికి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భాను చందర్ అక్కడికక్కడే మృతి చెందగా, రఘుపతి, మోహన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో ఇద్దరు కార్మికులు మల్లేష్, మైసయ్య గాయాలతో బయటపడగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ శిరీష్ కుమార్ చవాన్ ఈ ఘటనపై స్పందిస్తూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించామని తెలిపారు. తీవ్రమైన గాయాలతో ఉన్న ఇద్దరిని మల్టీ స్పెషాలిటీ బ్లాక్‌కు తరలించి ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించామని చెప్పారు.
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..