Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా డీఎన్ఆర్ కాలనీకి చెందిన శృతి యాదవ్ అనే యువతిని మదన్ ప్రేమించుకుంటున్నారు. అయితే, యువతి ఇంట్లో ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి చెందిన అతను నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు.
Read Also: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘డోజ్’ శాఖ మూసివేత
అయితే, శృతి పట్ల ప్రేమను వ్యక్త పర్చేందుకు ఆమె పేరును తన చేతిపై పచ్చబొట్టు రూపంలో వేయించుకున్న మదన్ యాదవ్.. ప్రియురాలు శృతికి ఇటీవల తన బావతో వివాహం జరపాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ప్రియుడు. తాము ఇద్దరం ఒకే కులానికి చెందినప్పటికీ ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. తాను ప్రేమలో మోసపోయానని భావించిన మదన్, నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మదన్ యాదవ్ ను అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.