జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా.. జరిగిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికిక్కడే చనిపోయాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: Fake Parking Scam: మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది..
పూర్తి వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని మానవపాడులో విషాదం చోటుచేసుకుంది. విష్ణుకుమార్-పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు.. అక్కడే ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు. అయితే బీసీ కాలనీలోకి వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ అక్కడికి చేరుకుంది. డ్రైవర్ ట్రాక్టర్ ని రివర్స్ చేస్తున్న క్రమంలో ఆడుకుంటున్న కార్తీక్ నాయుడిని బలంగా తాకింది. దీంతో బాలుడు అక్కడికిక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి విష్ణు కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.