HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ కి చెందిన రోషన్‌సింగ్(25) ఓ రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి…
Ganja Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన యజమానితో ఈ పొకిరి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. ఈ సందర్భంగా నాకు పగలగొట్టాలని అనిపించింది అందుకే పగలగొట్టాను, ఎక్కువగా మాట్లాడితే కారు మొత్తం తగలబెడతానని ఉల్టా బెదిరింపులకు ఈ గంజాయి బ్యాచ్ దిగింది.
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Love Marriage: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది.
Online Betting : ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల బారి ఎంత ఘోరంగా ఉందో మరోసారి తెలంగాణలో చోటుచేసుకున్న ఘటన నిరూపించింది. కష్టపడి సంపాదించిన డబ్బు.. చివరికి ఈ వర్చువల్ ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాన్నే త్యాగం చేసిన యువకుడు. ఈసారి ఆ బాధితుడు సాధారణ వ్యక్తి కాదు.. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థలో పనిచేసే కానిస్టేబుల్‌నే. సంగారెడ్డి జిల్లా కల్హేరు మండల కేంద్రానికి చెందిన సందీప్ (24) గత సంవత్సరం జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో…
Mahabubnagar Government Teacher Suspended: ఓ ప్రభుత్వ టీచర్‌కి మద్యం టెండర్ లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. కానీ.. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం పోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే టీచర్ తాజాగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. రూ.3 లక్షల డిపాజిట్ చెల్లించి ధర్మాపూర్ వైన్స్‌కు దరఖాస్తు చేసుకున్న ఆమెకు అక్టోబర్ 26న జరిగిన…
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.