CM Revanth Reddy : తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని…
నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్: నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.…
ఇవాళ ఏపీలో ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్ రిలీజ్.. వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా ఇంటర్ ఫలితాలు విడుదల నేడు తిరుపతిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. ఉదయం పది గంటలకు కచ్ఛపి ఆడిటోరియంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” సెమినార్ తిరుమలలో ఇవాళ తుంభూర తీర్ద ముక్కోటి.. ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ నేడు బెజవాడకు సీఎం చంద్రబాబు రాక.. మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి…
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.…
Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ…
Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి…
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు: రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు…
నేడు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం.. సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున జరగనున్న రాముల వారి కళ్యాణం ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ నేడు కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం ఈరోజు విజయనగరంలో పర్యటించనున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి..…
SP Shabarish : ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. అడవుల్లో నివసిస్తూ తమ జీవనోపాధిని సాగిస్తున్న ఆదివాసీలపై ఈ విధమైన బెదిరింపులు న్యాయసమ్మతం కావని ఎస్పీ…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. “మా తాతలూ, తండ్రులూ కాంగ్రెస్‌లో ఉండేవారు అంటూ చెప్పేవారు. కానీ మీకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నడవడం నిజమైన సిద్ధాంతమా?” అంటూ ప్రశ్నించారు. “చొక్కారావు గారు కాంగ్రెస్‌ను…