దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు.…
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ద్విచక్రవాహన దారుడు అదుపుతప్పి కింద పడ్డ పడ్డాడు. ఆ వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అని రోడ్డుపై ఇతర వాహన దారులు ధర్నాకు దిగారు. దీంతో బాల నగర్ నుంచి నర్సాపూర్…
హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ…
Violence : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటుపీజీ క్యాంపస్లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు దేవరాజు ఒకటో తరగతి చదువుతోన్న బాలుడు లవన్ సాయి కుమార్పై శారీరక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థి తరగతిలో అల్లరి చేశాడనే కారణంతో ఉపాధ్యాయుడు అతని వీపుపై బలంగా కొట్టినట్టు సమాచారం. ఇంటికి చేరిన బాలుడి పైన గాయాలను గమనించిన తల్లి, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే…
Viral : సాధారణంగా చిన్నారులు పరీక్షల సమయంలో తమ ఊహాశక్తిని ఉపయోగించి సమాధానాలు రాస్తుంటారు. అయితే ఒక్కోసారి వారి సమాధానాలు నవ్వించడమే కాక, సమాజాన్ని ఆలోచనలో పడేస్తాయి. అలాంటి ఒక సంఘటన చందుర్తి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చదువులో భాగంగా జరిగిన ఆంగ్ల పరీక్షలో నాలుగో తరగతి విద్యార్థిని ఒకరికి “Write about your mother’s likes and dislikes” అనే ప్రశ్న వచ్చింది. అంటే “మీ అమ్మకు నచ్చినవి, నచ్చని విషయాలు రాయండి”…
Ponguleti Srinivas Reddy : పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ మంత్రి ఆయన మృతిని “చాలా దురదృష్టకరమైనది, బాధాకరమైనది” అన్నారు. “పద్మశ్రీ వనజీవి రామయ్య మనకు కనిపించనంతగా దూరమయ్యారు. ఇది మనం తట్టుకోలేని నష్టం,” అని మంత్రి అన్నారు. ప్రభుత్వ…
Tragedy : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పరిస్థితి ఒక విషాద ఛాయను సంతరించుకుంది. నిర్లక్ష్యపు నిమిషాలు అమూల్యమైన ప్రాణాన్ని బలిగొన్నాయి. కేవలం 21 నెలల బాలుడు కార్పెంటైన్ ఆయిల్ను మంచినీళ్లుగా పొరపడి తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గ్రామస్థులను విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన ధన్వాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడ మమత, ఆమె భర్త నరేష్ కుటుంబంలో చోటు చేసుకుంది.…
Fight at Bus: పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించే ప్రజలు భద్రంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే కొంతమంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఇతరుల ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు చేసిన వీరంగం, యువతుల ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ నుంచి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తికి యువతులు తగిన గుణపాఠం చెప్పారు.…