CM Revanth Reddy : వర్షాలు పడిన ప్రతీసారీ హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న నీటి చేరిక, ట్రాఫిక్ జాం, లోతట్టు ప్రాంతాల్లో వరద వంటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తరువాత నగరంలో ఏర్పడిన అతలాకుతల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిపారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం వంటి అంశాలపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రతిసారీ చర్యలు చేపట్టడం కాకుండా శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతాల్లో వరదనీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, సీఎం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
వరద నీరు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా సాంకేతిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి చెరువు, నాలా, కాలువలన్నింటినీ మూసీ నదికి అనుసంధానం చేయాలన్నది ముఖ్యమంత్రిగారి కీలక ఆదేశం. చెరువులను పునరుద్ధరించాలి, నాలాల వెడల్పు ప్రక్రియ వేగవంతం చేయాలి. నగరంలో వర్షం పడితే నీరు తక్షణమే చెరువుల్లోకి, ఆపై నాలాల ద్వారా మూసీకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి వరద సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే మార్గమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇది ట్రాఫిక్ సమస్యను కూడా అదుపు చేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్..