Murder : హైదరాబాద్‌లోని బోరబండ ఇంద్రానగర్‌లో మద్యం తాగిన ఇద్దరు కజిన్ల మధ్య జరిగిన గొడవ దారుణంగా మారింది. ఈ ఘర్షణలో ఒకరు రాతితో కొట్టి మరొకరిని హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుడు బసవరాజ్ (30), నిందితుడు ప్రేమ్‌రాజ్ ఇద్దరూ ఇంద్రానగర్ నివాసితులు. సోమవారం రాత్రి పార్వతీనగర్‌లో మద్యం సేవించిన సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి నిద్రపోయారు.
Jharkhand: శిబు సోరెన్‌కు నివాళులర్పిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన చంపై సోరెన్
అయితే, మంగళవారం తెల్లవారుజామున ప్రేమ్‌రాజ్ మేల్కొని, ముందుగానే తెచ్చిన రాయితో బసవరాజ్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో బసవరాజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు గమనించి అతడిని సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఇప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ.. వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!