షాకింగ్.. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు సతీమణి మృతి!
ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు యాక్సిడెంట్ కారణంగా మరణించారు. 1973లో కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. షాక్ కు గురైన రుక్మిణి.. మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణీ. ఈ విషయాలను కోట బయటకు చెప్పలేదు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘అమరావతి లో ఉన్న గ్రామ కంఠాల అభివృద్ధి కి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. 904 కోట్లు 29 గ్రామాలకు కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.. నీటి సరఫరా…కు 64 కోట్లు…సీవరేజ్ కోసం 110 కోట్లు..రోడ్లు..కోసం..300 కోట్లు..కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ లో అనుమతి తర్వాత.. రాబోయే 10 రోజుల్లో టెండర్లు పిలుస్తాం.. మంగళగిరి లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది..
తూప్రాన్‌లో వర్ష భీభత్సం.. జలదిగ్బంధంలో పలు కాలనీలు
మెదక్ జిల్లా తూప్రాన్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులు, బట్టలు తడిసి పనికిరాకుండా పోయాయి. కొందరు స్థానికులు థర్మకోల్ షీట్లు వినియోగించి వరద నీటిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు, పిల్లలు సైతం ఇళ్లలో చిక్కుకుపోవడంతో జేసీబీలు, టిప్పర్ల సాయంతో వారిని బయటికి తీసుకువస్తున్నారు. నిన్నటి నుండి వరద కొనసాగుతున్నా, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం.. హైదరాబాద్ భక్తుడి వద్ద రూ. 90 వేలు వసూలు
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. సోషియల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్నారు దళారులు. శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కి చెందిన భక్తుడి వద్ద దర్శనాల పేరుతో రూ. 90 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుడు దళారుపై టిటిడి విజిలెన్స్ కి పిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. దళారులు శర్మ, నటరాజ్ లపై ఇప్పటికే 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారానే టిక్కెట్లు పొందాలని టిటిడి సూచిస్తోంది.
భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో వివిధ విభాగాల్లో ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వారు సీఎంకు వివరించారు.
నాగార్జునసాగర్, జూరాలలో వరద ఉధృతి.. భారీ నీటి విడుదల
తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల వరకు, మరో 14 గేట్లు 5 అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 585.70 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి మట్టం 590 అడుగులు. అలాగే పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 299.46 టీఎంసీలుగా నమోదైంది.
ప్రధాని మోడీని కలిసిన శుభాన్షు శుక్లా.. అంతరిక్షం నుంచి తీసిన భూమి చిత్రాలను బహూకరించారు
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కలిశారు. ఈ సందర్భంగా, శుభాన్షు తన చారిత్రాత్మక ఆక్సియం-4 మిషన్ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోదీకి బహూకరించారు. ఈ త్రివర్ణ పతాకం భారతదేశం మానవ అంతరిక్ష విమానాల కొత్త యుగానికి ప్రతీక. అంతరిక్షం నుంచి తీసిన భూమి చిత్రాలను బహూకరించారు.ప్రధాని మోడీ శుభాన్షును కౌగిలించుకుని స్వాగతం పలికారు. శుభాన్షు తన అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రికి చూపించారు. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో, శుభాన్షు శుక్లా తన మిషన్ కు సంబంధించిన సవాళ్లను పంచుకున్నారు. ఆక్సియం-4 మిషన్‌లో ఆయన నిర్వహించిన శాస్త్రీయ ప్రయోగాలు, మానవ శరీరంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేయడం, అంతరిక్షంలో వ్యవసాయానికి ఉపయోగించే సాంకేతికతలు వంటివి భారతదేశ గగన్‌యాన్ కార్యక్రమానికి ముఖ్యమైనవి. శుభాన్షు శుక్లా సాంకేతిక విజయాలను మోడీ ప్రశంసించారు.
చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ నుండి 72 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.