విద్యార్థులు మధ్య చిన్న ఘర్షణ ప్రాణాలు తీసుకునేందుకు తెలుత్తుతున్నాయి. చిన్న చిన్న మాటలకు జీవితాన్ని నాసనం చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు పసి ప్రాణాలు. చిన్న వయస్సులో ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. సెల్ ఫోన్ మహత్యమా.. లేక సినిమాల ప్రభావమో. ఒక విధ్యార్థి తోటి విద్యార్థిని బిర్యానీ ప్యాకెట్ చూశావా అని అడినందుకు మరో విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడిన విచిత్ర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్లంపల్లికి చెందిన రామస్వామి, సువర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేష్ అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో అక్కడ హాస్టల్‌లో ఉంటున్న తమ వార్డులను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. అయితే.. అదే తరగతికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బాలుడి కోసం బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చారు. అరుణ్ మధ్యాహ్నం బిర్యానీ తిని, రాత్రి తర్వాత తినడానికి మిగిలిపోయిన వాటిని పెట్టెలో ఉంచుకున్నాడు. తర్వాత పెట్టెలో చెక్ చేయగా అది కనిపించలేదు. ఇది తిన్నారా అని స్నేహితులను అడగడంతో పాటు.. రాజేష్‌ను కూడా ఇదే విషయమై ప్రశ్నించాడు. దీంతో అవమానంగా భావించాడో.. లేక తనే తినేసానని తెలిసింది అనుకున్నాడో ఏమో గానీ రాజేష్ ఏమీ మాట్లాడకుండా పరుగులు పెడుతూ..హాస్టల్ భవనంపై అంతస్తు వరకు వెళ్లాడు. అక్కడి నుంచి కిందికి దూకేసాడని తోటి విధ్యార్థులు చెబుతున్నారు. అయితే వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది రాజేష్‌ను చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతని కుడి కాలు ఫ్రాక్చర్ అయి ఉంటుందని వైద్యులు అనుమానించడంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు దొంగతనంగా బిర్యానీ తినడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు. అయినా తోటి విద్యార్థులు నా కుమారున్ని వేధిస్తుంటే అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు. తన కుమారున్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
President of India : ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ముర్ము ఎన్నిక