CM KCR Wishes International Women Day: సమాజంలో సగభాగమైన మహిళలు.. అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురుషునితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతాయని పేర్కొన్నారు. స్త్రీ శక్తిని చాటే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
Mother Attack Daughter: ఇష్టం లేని పెళ్లి.. కూతుర్ని చంపేందుకు తల్లి కుట్ర
మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి, మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకాలతో.. తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగోందుతోందని అన్నారు. తల్లి కడుపులో ఆడబిడ్డ ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తున్నామని.. ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటోందని వివరించారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Women Builders Drill: ఛీ ఛీ.. పాడు..బ్రహ్మచారి దేవుడి ముందు బికినీ ప్రదర్శన
కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటివరకు 13,90,639 మంది లబ్దిదారుల కోసం రూ.1261 కోట్లు ఖర్చు చేశామని.. అలాగే ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసరా పథకం కింద ఒంటరి మహిళలకు రూ.1,430 కోట్లు, వితంతువులకు రూ.19,000కోట్లు, మహిళా బీడీ కార్మికులకు రూ.5,393 కోట్లు ఫించనుగా పొందినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,03,818 మంది లబ్దిదారులకు రూ.11,775 కోట్లు అందాయన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కోసం రూ.1,536 కోట్లు ఖర్చు చేశామన్న కేసీఆర్.. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచామన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు.