MLC Jeevan Reddy Demands To Cancel Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయకపోతే, ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కేసు కోర్టులో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారని, మరి భవిష్యత్తు ఏంటి? అని ప్రశ్నించారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలను నిర్వహించకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించారని మండిపడ్డారు. గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న కూడా.. నివాసిత ప్రాంతాలైన రైతుల భూములను రిక్రియేషన్ కింద పరిగణిస్తున్నారని, రెసిడెన్షియల్ భూమిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. హస్నాబాద్, లింగంపెట్, అంబరిపెట చుట్టుప్ర్కల ప్రాంతాలన్నీ నివాసిత ప్రాంతాలేనని పేర్కొన్నారు. జనవరి 25న మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గం తీర్మానం చేసినా.. పూర్తి రద్దుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాత్కాలిక నిలుపుదల పరిష్కారం కాదని.. దాన్ని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జగిత్యాల పరిసర గ్రామ రైతుల హక్కులు కాలరాయద్దని, మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయి రద్దుకు ఎమ్మెల్యేలు, మంత్రిని కలిసి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించారు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
అంతకుముందు.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూ.20వేల కోట్లు వచ్చే రాబడి భూములను కోల్పోయామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ.17వేల కోట్లు కేటాయించారని.. కాని ఇప్పటివరకు ఒక్క లబ్దిదారుని గుర్తింపు కూడా జరగలేదని వ్యాఖ్యానించారు. మంత్రి కొప్పుల తన నియోజకవర్గంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ స్కీం కోసం రూ.12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, ఇళ్లు కట్టుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామన్నారని.. కానీ అది కూడా ఇప్పటివరకూ ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, హౌసింగ్ స్కీం అనేవి జీరో ఫర్ఫామెన్స్ అని దుయ్యబట్టారు.
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్‌గా భారీ విగ్రహం