తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు.
రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కులాలకు అతీతంగా పెద్దగట్టులోని లింగమంతుల స్వామిని కొలుస్తున్నారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తరపున మొక్కులు చెల్లించుకున్నామని ఆయన వెల్లడించారు.
అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అంతా డొల్ల అని.. ఎలక్షన్ స్టంట్ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుష్క వాగ్దానాలు-శూన్య హస్తాలేనంటూ ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ - 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ను నిర్వహించనున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు.
KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మనోహరాబాద్లో రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో నిర్మించిన ఐటీసీ పరిశ్రమను ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు.