Brain Dead : హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల కార్మికుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది.
సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు.
నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలుకు ఫ్రాక్చర్ అయింది. మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పోస్ట్ చేశారు.