Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
RTC Kala Bhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. కందిపప్పులో నూర్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Minister KTR Investment: హైదరాబాద్‌లోని ఇద్దరు పాఠశాల విద్యార్థినిల మానస పుత్రిక అయిన డిజి జ్ఞాన్ అనే స్టార్టప్‌కి మంత్రి కేటీఆర్ ముచ్చటపడి సొంతగా 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ డిజిటల్ స్టార్టప్ వేదికను ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల కోసం రూపొందించారు.
హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది.
టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా ప్రజలకు క్లీనర్, మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పనులు మొదలు పెట్టింది. వచ్చే నెల నుండి హైటెక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు జరుగుతున్నాయి.
ములుగు జిల్లా రామప్ప దేవాలయం వారసత్వ ఉత్సవాలకు సిద్ధం అయ్యింది. ‘శిల్పం వర్ణం కృష్ణం’ అనే పేరుతో ప్రపంచ వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాని ప్రభుత్వం ఏర్పట్లను పూర్తి చేసింది.