మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో మహిళ దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రెండవ భర్త మధు, స్వప్న శ్రీ మధ్య మూడెకరాల భూమి పట్టా విషయం లో వివాదం నడుస్తుంది. విడాకులు తీసుకున్న తరువాత ఆ భూమీ తన పేరిట పట్టా చేయాలని వేల్పుల మధుకర్ ఒత్తిడి చేయడంతో.. దానికి స్వప్న శ్రీ ఒప్పుకోకపోవడంతో మూడు లక్షలు కట్టితే మొత్తం భూమి తనకు రాయాలని మధు డిమాండ్ చేశాడు.
Also Read : PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
మూడు నెలల్లో మూడు లక్షలు కడితే మధుకు భూమీ రాసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. చెరి సగం అంటూ ఇదివరకు పెద్దలు పంచాయితీ చెప్పారు. మూడు లక్షలు ఇస్తా మొత్తం భూమి కావాలని రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షలు రైతు బందు వచ్చింది ఇంకో లక్ష కడుతానని మధు చెప్పాడు. దానికి స్వప్న శ్రీ ససేమిరా అనింది. అయితే మూడో భర్తతో మంచిర్యాలలో స్వప్న శ్రీ ఉంటుంది. ఇవాళ (శుక్రవారం)మధ్యాహ్నం స్వప్నను ఒంటరిగా చిక్కించుకొని.. ఆమెపై మధుకర్ తో పాటు దుండగుల చేత కత్తులతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది.
Also Read : MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ
పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా స్ధానికులు తెలిపారు. వేల్పుల మధూ, ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారని స్వప్ర శ్రీ మూడవ భర్త రవి ఆరోపించాడు. దీంతో ఈ హత్యపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో గొడవే హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్నారు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.