Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత…
Telangana : తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షుడిగా గటిక విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు ఏకగ్రీవ నిర్ణయంతో ఆయనను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల నాయకులు, సభ్యులు భారీగా హాజరయ్యారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గటిక విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. “పెరిక కుల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. రాష్ట్రంలో ప్రతి జిల్లా స్థాయిలో కుల ఐక్యతను బలపరుస్తాం.…
పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం.. పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రేపు సీఆర్డీఏ…
విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్‌ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలు కానుంది. దీనికి…
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు కొందరు వాహనదారులు. చివరకు పోలీసుల తనిఖీల్లో పట్టబడి భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారు. తాజాగా ఓ బైక్ పై ఏకంగా 277 చలాన్లు నమోదయ్యాయి. రూ. 79,845 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు…
Hydra: హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో…