Kidnap : మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ఆమెను తన ఆటోలోకి ఎక్కించాడు. “నీ తండ్రి…
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని…
QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు.
Shocking : నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఒక మహిళ మృతదేహం గుర్తించడంతో కలకలం రేగింది. అడవిలో దుర్వాసన వస్తోందని గుర్తించిన గ్రామస్థులు దగ్గరగా వెళ్లి చూసే సరికి భయానక దృశ్యం కనబడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పెంట్లవెల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. Madagascar Government Dissolved: మడగాస్కర్‌లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది? మృతదేహం తీవ్రంగా…
Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…
Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది.…
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.…