Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Hyderabad Man In Russia: గల్ఫ్ మోసాలు చూస్తూనే ఉంటాం. ఏమీ తెలియని.. చదువు రాని అమాయకులను.. ఏజెంట్లు మోసం చేస్తుంటారు. హైదరాబాద్‌లో చదువు ఉండి కూడా ఓ యువకుడు కన్సల్టెన్సీ చేతిలో మోసపోయాడు. రష్యాకు వెళ్లిన అతడికి దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. సెల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకుని రక్షించాలని వేడుకుంటున్నాడు. ఇంతకూ రష్యాలో అతడికి ఎదురైన అనుభవం ఏంటి? ఆ యువకుడి పేరు మహ్మద్ అహ్మద్. ఇతడు దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్నాడు.…
Malla Reddy : మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సంయుక్త భాగస్వామ్యంతో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గూగుల్‌తో ఇంత భారీ స్థాయిలో డిజిటల్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం. భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ గా ఇది…
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో విషాదం నెలకొంది. రోజుల వ్యవధిలో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య యత్నంకు పాల్పడగా.. ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేని దంపతులు కూతురుకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో రాజీవ్ నగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజీవ్ నగర్‌కు చెందిన భార్య-భర్తలు బండి చక్రవర్తి, దివ్యకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రెండు నెలల క్రితం…
Kidnap : మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ఆమెను తన ఆటోలోకి ఎక్కించాడు. “నీ తండ్రి…
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని…
QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు.