Human Rights Forum: రియాజ్ ఎన్కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Rights Forum: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రియాజ్ ఎన్కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. “ఈ ఎన్కౌంటర్‌ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నాం.. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్య నేరం మోపాలి. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి.” అని మానవ హక్కుల వేదిక తెలంగాణ పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE: Leopard In Village: జనారన్యంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
కాగా.. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్ లో భాగంగా ఆర్ ఐ గది వద్దకు వెళ్ళగానే శబ్దం వినిపించటంతో రూమ్ లోకి వెళ్ళాడని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకి లాక్కున్నాడని అన్నారు. ఆ తర్వాత రియాజ్ ట్రిగ్గర్ లాగే ప్రయత్నం చేసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు తెగబడ్డాడని వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా గత్యంతరం లేక ఆర్ ఐ రియాజ్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!