CM Revanth Reddy: జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ప్రతి అధికారి పూర్తి స్థాయిలో తమ విధులను నిర్వహించాలని, చేయలేని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు పని చేయాలని, పని చేయడం ఇష్టం లేని వాళ్ళు cs.. డీజీపీ కి చెప్పి తప్పుకోవచ్చన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభల పై సమీక్షలు ఉంటాయన్నారు. ‘ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.
Also Read: Madhya Pradesh: “మీ చెల్లికి నిప్పంటించాం”.. సోదరుడికి అత్తమామల ఇంటి నుంచి ఫోన్..
ఎస్ ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి.తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. అరు గ్యారంటీలు అమలుకు మీరే మా సారథులు. పనిచేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సిఎస్ డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం.
Also Read: Husband Kills Wife: దారుణం.. కట్టుకున్న భార్యను కత్తితో కడతేర్చిన భర్త
కబ్జాదారులు, రక్ష సరఫరాదారుల పై కటినంగా వ్యవహరించాలి. భూ కబ్జా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణపైన పోలీసులు నిగా పెట్టి అసలు విషయం తేల్చాలి. గంజాయి పై కఠినంగా పోలీసులు వ్యవహరించాలి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలి. గంజాయి విస్తరణ కాలేజీలో చేరింది. పోలీసులు వీటిపై చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా నిగా పెట్టాలి నిబంధనలో అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలే అమ్ముతున్నాయి ఇలాంటి వాళ్లను లిస్టు తయారుచేసి ఉక్కు పాదం పెట్టాలి’ అని ఆదేశించారు.