Wines Tender : తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ,…
‘నో-హ్యాండ్‌షేక్’ ట్రెండ్‌ను కొనసాగించిన భారత యువ క్రీడాకారులు.. పాక్‌పై ఘన విజయం ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్‌లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్‌ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ…
లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం! నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష…
Human Rights Forum: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. "ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నాం.. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ…
నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..? నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు…
Ganja Batch : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో శనివారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. చంద్రయాన్ గుట్ట ఏరియాలోని ASIపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే ముప్పతిప్పలు పడేలా ఆ గంజాయి బ్యాచ్ ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారు రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తుండటంతో…
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక…
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా…