Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం కలకలం
- షోరూం స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు
- దట్టమైన పొగతో ఇబ్బంది పడ్డ స్థానికులు
- ఫైర్ సిబ్బంది శ్రమతో అదుపులోకి మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : హైదరాబాద్ లోని అంబర్‌పేట నెంబర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మహీంద్రా , రెనాల్ట్ కార్ల షోరూంలకు చెందిన స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గోదాంలో ఉన్న పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, లెదర్ సీట్లు అంటుకోవడంతో ఆకాశమంతా నల్లటి దట్టమైన పొగ కమ్ముకుంది. కార్ సర్వీసింగ్ సెంటర్లలో మార్చిన పాత వస్తువులను భద్రపరిచే గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే సర్వీసింగ్ కోసం వచ్చిన అనేక కార్లు అక్కడ పార్క్ చేసి ఉండటంతో, మంటలు వాటికి కూడా వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. దీనితో అప్రమత్తమైన షోరూం సిబ్బంది వెంటనే ఆ వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
గోదాంలో టైర్లు, లెదర్ ఐటమ్స్ కాలిపోవడంతో వెలువడిన దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల నివాసితులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. షోరూం వెనుక వైపున ఉన్న అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలకు మంటలు వ్యాపించే ముప్పు ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి ప్రజలను తక్షణమే ఖాళీ చేయించారు. రద్దీగా ఉండే అంబర్‌పేట చౌరస్తాలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి. పొగ ఎక్కువగా ఉండటంతో గోదాం లోపలికి వెళ్లడం సిబ్బందికి కష్టంగా మారింది. వాటర్ స్ప్రే చేయడంతో పాటు పరిస్థితిని బట్టి ఫోమ్ (Foam) ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..