IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- అటవీ శాఖలో కీలక బదిలీలు
- కొత్త బాధ్యతలు స్వీకరించిన అధికారులు
- జిల్లాల వారీగా డీఎఫ్‌వోల మార్పులు
- పరిపాలన బలోపేతానికి ప్రభుత్వ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IFS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో కీలక మార్పులు చేస్తూ పెద్ద ఎత్తున బదిలీల ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 12 మంది ఐఎఫ్ఎస్ (IFS) , నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట జీవో విడుదలయ్యింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీలలో భాగంగా ఎస్. రమేష్‌ను హైదరాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా నియమించగా, ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్‌గా బి. ప్రవీణను నియమించారు. అలాగే వికారాబాద్ డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న జి. జ్ఞానేశ్వర్‌ను అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లా అటవీ అధికారుల (DFO) నియామకాల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. చ. బాలమణిని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ డీఎఫ్‌వోగా, బోగా నిఖితను వరంగల్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎఫ్‌వోగా వికాస్ మీనా, మహబూబ్‌నగర్ జిల్లాకు శివ్ ఆశీష్ సింగ్, నిజామాబాద్ జిల్లాకు సిద్ధార్థ విక్రమ్ సింగ్ కొత్త అధికారులుగా నియమితులయ్యారు. మంచిర్యాల డీఎఫ్‌వోగా రాహుల్ కిషన్ జాదవ్, కామారెడ్డికి నీరజ్ కుమార్ తిబ్రేవాల్ , ఖమ్మం జిల్లాకు అనుజ్ అగర్వాల్‌ను ప్రభుత్వం కేటాయించింది. వీరికి తోడుగా ఎస్. సత్యనారాయణకు రాజన్న సిరిసిల్ల , కరీంనగర్ జిల్లాల ఉమ్మడి డీఎఫ్‌వో బాధ్యతలను అప్పగించారు. తక్షణమే అమలులోకి వచ్చే ఈ బదిలీలు రాష్ట్రంలోని అటవీ సంరక్షణ , పరిపాలనను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!