Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- సంగారెడ్డిలో విషాదం.. బావిలో పడి ముగ్గురు మృతి
- బట్టలు ఉతకడానికి వెళ్లి జరిగిన దుర్ఘటన
- తల్లి, ఇద్దరు కుమార్తెల మృతితో కుటుంబం ఛిన్నాభిన్నం3 కేసు నమోదు.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : సంగారెడ్డి జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జిల్లాలోని కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బట్టలు ఉతకడానికి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు బావిలో పడిపోగా, వారిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారు కూడా బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. నీటిలో మునిగిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
ఈ ప్రమాదంలో మరణించిన వారిని తల్లి సావిత్రి బాయి, ఆమె కుమార్తెలు నికిత (13), నందిని (12) గా గుర్తించారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఇద్దరు ఆడపిల్లలతో పాటు తల్లి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను బావిలో నుండి బయటకు తీశారు. చేతికి అందొచ్చిన పిల్లలు, భార్య కళ్ల ముందే శవాలుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!