K.Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ ఇచ్చింది. కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Janagama: జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని దారుణం చోటుచేసుకుంది. పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
AP- TS 10th Class Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల అదనపు గ్రేస్ టైమ్ ఇచ్చారు.
elangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌కు చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్య తన భర్త అశోక్ రాజ్‌తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలోని మీర్కావేలో నివసిస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్, తుల ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మీటింగ్ ఆలస్యం అయినా, మనం ఓడిపోయిన గుండె, ధైర్యంతో ఓపిక తో కూర్చున్న మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. రైతులు అంటున్నారు, కేసీఆర్‌ను ఓడగొట్టుకొని తప్పు చేశాం అర్థ రాత్రి కరెంట్ మోటార్లు వేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. డిసెంబర్ 3న కేసీఆర్ ముఖ్య…
లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది…
హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ…
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్: ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి జరుగుతుందంటూ ప్రజల్లో ఉత్కంఠ…
ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే…