రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలు అవాస్తవాలు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను నీరు గార్చింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికిరా., కులాల ఆధారంగా రిజర్వేషన్ లు వద్దని నెహ్రూ అప్పటి సిఎం లకు లేఖ రాసిన మాట వాస్తవమా కాదా అంటూ వ్యాఖ్యానించాడు. రాజీవ్ గాంధీ బీసీలకు 27% రిజర్వేషన్ లు వ్యతిరేకించింది వాస్తవమా కాదా., భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలి. దేశంలో 2 సిద్దాంతాల మధ్య పోటీ జరుగుతుంది.
జూన్ 4 తరవాత పరాభవం తప్పదు., మిగిలేది గాడిద గుడ్డే. చాయ్ వాలకు అగర్భా శ్రీమంతుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న పోటీ. దేశాభివృద్ధికి కి కుటుంబ రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోటీ ఇది. RR టాక్స్ పేరుతో జలగలుగా పీడుస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ లు రాజ్యాంగ విరుద్ధం., రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా దిగజారి మాట్లాడుతున్నారు.
హిందూ దేవుళ్ళు రాముడు అంటే ఎందుకు అంత కోపం., రేవంత్ రెడ్డి హిందువు అని చెప్పుకునే అర్హత లేదని కాస్త ఘాటుగా విమర్శలు గుప్పించారు.
Also Read: 2024 ICC Women’s T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు..
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నీకు కావాల్సిన వారితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నింపుకున్నావు. నిరుద్యోగులకు గాడిద గుడ్డు చూపుతున్నావు., ఇచ్చిన హామీలను నెరవేర్చక గాడిద గుడ్డు చూపుతున్నావ్.. కేంద్ర హోం మంత్రి, పీఎంను వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రజలు అసహ్యుంచుకుంటున్నారు., పదవులు రానందుకు అలా మాట్లాడుతున్నారా.? రూ. 2,500 ఇవ్వలేని మీరు లక్ష రూపాయలు ఎక్కడ నుండి ఇస్తారు అంటూ కాంగ్రెస్ పై పెద్దఎత్తున్న విమర్శలు గుప్పించారు.