తెలంగాణ మోడల్ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్స్ 2024 కోసం నోటిఫికేషన్ ప్రకటించబడింది. అడ్మిషన్ 2024 – 25 విద్యా సంవత్సరకు జరుగుతుంది. ఈ ప్రవేశం మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయాలి. మే 31 చివరి రోజు అని ప్రకటించారు. దరఖాస్తు షరతులు పదవ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు వర్తిస్తాయి.
ALSO READ: SBI Jobs: ఎస్‌బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం కోసం ప్రవేశాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో అడ్మిషన్లను అందిస్తారు. ఇక వీటికి అర్హత విషయానికి వస్తే.. పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ: Team India Coach: టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కోచ్గా కొనసాగనున్నారా.. జైషా ఏమన్నారంటే..?
ఆన్ లైన్ లో దరఖాస్తు పూరించాలి. ఇక ఈ దరఖాస్తులు ప్రారంభం 10, మే, 2024 నుండి మొదలుకాగా.. దరఖాస్తులకు తుది గడువును 31 మే, 2024గా ఇచ్చారు. వీటికి ఎంపిక విధానంలో పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ https://telanganams.cgg.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.