Kisan Reddy : పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది.
ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగర వాసులకు రంజాన్ నేపథ్యంలో కీలక సూచన చేశారు. ఏప్రిల్ 11న రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ పితర్ ప్రార్థనల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు..…
కొందరి శరీరంలో అనుకోకుండా అనవసరమైన భాగాలు వృది చెందడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా వచ్చిన వాటితో అనవసరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించే ఉంటాం. అయితే వాటిని సర్జరీ చేయించుకొని తీసేసిన తర్వాతనే వారు పూర్తి ఆరోగ్యంగా మారుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. Also read: SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?! తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత…
Fire Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. అత్తాపూర్‌లోని పత్తి ప్యాకింగ్ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
తెలంగాణలోని విద్యార్థుల స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఇదివరకే అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచిన సంగతి మనకి తెలిసిందే. ఇకపోతే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి గడువు పెంచదని అర్థమవుతుంది. ఈ విషయం సంబంధించి అధికారులు కూడా మార్చి 31 చివరి తారీకు అంటూ తెలిపారు. ఒకవేళ ఇప్పటికి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈరోజు అప్లై చేసుకోవాలి అంటూ అధికారులు తెలిపారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన…
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సంబంధించి బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఓ శుభవార్తను తెలియజేసింది. ఇందులో భాగంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్…
MP Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ నెల 27 (బుధవారం) చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Holi in Nizamabad: ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సాలో పిడిగుద్దుల ఆటను నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.