తెలంగాణలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల మీద వేటు తప్పదా? అందుకు వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమయ్యారా? ఇక రణమే తప్ప…శరణం లేదని డిసైడై… వాళ్ళు కూడా అజెండా ఫిక్స్ చేసుకున్నారా..? మొత్తం పది మంది పార్టీ ఫిరాయిస్తే… వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది? ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడం తప్ప మరో గత్యంతరం లేదని వాళ్ళు కూడా ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.…
Beerla Ilaiah : ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు…
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇచ్చే సిఫార్సు లేఖల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనం మరియు రూ. 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధులు…
Telangana Assembly: తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువు దీరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.