తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయి. ఆ పార్టీలు సంక్షేమం గురించి పట్టించుకున్నాయా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీళ్లు సరిగా ఉన్నాయా… నీళ్లు లేవు నీళ్లు ఉన్న కరెంటు లేదు. రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన బతుకుల్లో వెలుగులు నింపుతున్న. ఆడబిడ్డలకు మేనమామ లాగా సీఎం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నారు అని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవిస్తే 12 వేల రూపాయలు ఇచ్చి కెసిఆర్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుంది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా ఆలోచించాలి. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆశీర్వదించాలి అని పేర్కొన్నారు.