Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు ను స్టడీ చేసిన ప్రభుత్వం.. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్…
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో…
Local Body Elections: తెలంగాణలో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంతమందిని అదృష్టం వరించింది. రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా గ్రామాల్లో కొంతమందికి లక్కు కలిసి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో ఒకే ఇల్లు ఉండడంతో గతలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారే మరోసారి సర్పంచ్ గా మరోసారి ఎన్నిక కానున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గౌరారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సగం వార్డులు ఎస్టీలకు కేటాయించారు. RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ వందేళ్ల…
Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల…