Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు…
GHMC Ward Delimitation: GHMC వార్డుల పునర్విభజన పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు రావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1,283 అభ్యంతరాలు అధికారులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ మరో రెండు పొడిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎల్లుండి వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఒక్కో వార్డులో తక్కువ జనాభా మరో…
Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, అర్థరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి.…
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగయగా.. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి స్తాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.…
అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్…
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం నాగరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడని నిర్దారించడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజుకు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద…
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సర్పంచ్ అభ్యర్థి పదవులు గెలవడం కోసం పలువురు అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మద్యం, డబ్బులు పంపిణీ చేసి గెలవాలని పలుచోట్ల అభ్యర్థులు ప్రయత్నాలు చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలవడం అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు. నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. Also…
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు.. 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఫలితాల అనంతరం వార్డు సభ్యులతో చర్చించి.. ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.
Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం…
Telangana Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా…