Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల…
Election Commission: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా వారీ అబ్జర్వర్లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సమావేశంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈసీ చర్యలు అధికార…
DGP Shivadher Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ... గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. Also Read: Niloufer Cafe Babu…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు ను స్టడీ చేసిన ప్రభుత్వం.. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్…
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో…