తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ.. వీలైనప్పుడల్లా.. సందర్భం వచ్చినప్పుడల్లానే కాదు.. సందర్భాన్ని క్రియేట్ చేసి మరి తెలంగాణను వచ్చివెళ్తున్నారు బీజేపీ కీల నేతలు.. కేంద్ర మంత్రులు.. ప్రతీసారి ఏదో ఒక రకమైన కొత్త చర్చకు తెరలేపి వెళ్లిపోతున్నారు.. గత పర్యటనలో మునుగోడు సభలో పాల్గొన్న షా.. వెళ్తూ వెళ్తూ.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి భోజనం చేశాసి వెళ్లారు.. ఆ భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.. ఇక, 15 రోజు ల వ్యవధిలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి హైదరాబాద్ వస్తున్నారు.. హైదరాబాద్ రాష్ట్ర విమోచన 75వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈ నెల 17వ తేదీన జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. దీనిపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలకు లేఖలు కూడా రాశారు..
Read Also: Telangana: సాయుధ పోరాటం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే… మిగతావాళ్లు పుట్టనే లేదు..!
అయితే, సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.. దీని కోసం ఒకరోజు ముందుగానే.. అంటే.. ఈ నెల 16వ తేదీనే సిటీలో అడుగుపెట్టనున్నారు.. 17వ తేదీన ఉదయం పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవం లో పాల్గొననున్న షా… ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో భేటీకానున్నారు.. మునుగోడు బైపోల్‌ను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. మునుగోడు ఉప ఎన్నికతో పాటు.. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, నేతల చేరికలు.. ఇతర అంశాలపై కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చర్చ సాగుతుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మరో టాలీవుడ్ హీరో నితిన్ సమావేశం అయ్యారు. మరి ఈ సారి కూడా ఎవరినైనా కలిసేలా ప్లాన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చర్చ సాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.