ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా మారుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా శాసనసభ నుంచి వెళ్తున్నానని, రాజకీయ శక్తిగా తిరిగివస్తానని చెప్పుకొచ్చారు. తనను ఆశీర్వదించండని, తనతో పాటు నడవండని కవిత కోరారు. ‘కౌన్సిల్లో ఇవాళ మరొకసారి నా రాజీనామాను…
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. ‘ఇసుక…
శాసనమండలిలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టారని చెప్పారు. బీఆర్ఎస్‌లో మొదటి నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని శాసనమండలిలో ఎమ్మెల్సీ…
MLCs Oath Ceremony: తెలంగాణ రాష్ట్రంలో కొద్దీ రోజుల క్రితం జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు నేడు (సోమవారం) శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున మల్కా కొమురయ్య, అంజి రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి ముఖ్య…
MLCs Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఈ రోజు ( ఏప్రిల్ 7న) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేటి ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైనా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. Read Also: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్…
BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి, ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం…
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో…
Konda Surekha : తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతోందని, ప్రజల ముందు తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతోనే అసలు విషయాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా అర్ధాంతరంగా వ్యవహరించడం సబబు కాదని, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని అన్నారు. “బీఆర్ఎస్ సభ్యులు…
CM Revanth Reddy : తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన విమర్శలను నిరసిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వారు 15 నిమిషాలుగా నిరసన తెలిపారు. సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “స్టేచర్ గురించి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి. గత ప్రభుత్వం…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.