ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు. Also Read:Shiva Re-Release :…
హైకోర్టు తాజాగా ఇచ్చిన 222 పేజీల తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పనితీరుపై తీవ్ర ఆక్షేపణలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లో కలవరం సృష్టిస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కమిషన్ పునరాలోచనలో పడింది.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్…
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హరీష్‌రావు పిటిషన్ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు కోర్టుకు విన్నవించారు.ా Also Read:Heart Attack: డ్యూటీలో ఉండగా…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వాఖ్యల గురించి నాంపల్లి స్పెషల్ కోర్టులో కేస్ వేశాడు కాసం వెంకటేశ్వర్లు. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో…
సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు..
Telangana : తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కోలీజియం ఇటీవల చేసిన సిఫారసులను ఆమోదిస్తూ, నలుగురు కొత్త జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైకోర్టులో న్యాయ వ్యవస్థ మరింత బలపడనుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. Vangalapudi Anitha: వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు! ఈ నియామకాలతో గాడి ప్రవీణ్‌కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్…
Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. కొలిజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బదిలీ అమలులోకి వచ్చింది. జూలై 14, 2025న విడుదల చేసిన కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి. Ravindra Jadeja:…