సుప్రీం కోర్టు కొలీజియం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. మే 26న జరిగిన సమావేశంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జీల బదిలీలకు సిఫారసు చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తా కు బదిలీ, న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు కర్ణాటక నుంచి ఢిల్లీ కి, న్యాయమూర్తి లనుసుంకుమ్ జామిర్ గౌహతి నుంచి కలకత్తా కు, న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ గౌహతి నుంచి ఒరిస్సా కు, న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సంప్రే బాంబే నుంచి ఢిల్లీ కి, న్యాయమూర్తి అశ్విని కుమార్ మిశ్రా అలహాబాదు నుంచి పంజాబ్ & హర్యానా కు, న్యాయమూర్తి సుమన్ శ్యామ్ గౌహతి నుంచి బాంబే కు బదిలీ..
Also Read:Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల
న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్ శర్మ పంజాబ్ & హర్యానా నుంచి రాజస్థాన్ కు బదిలీ, న్యాయమూర్తి వివేక్ చౌధరీ అలహాబాదు నుంచి ఢిల్లీ కి బదిలీ, న్యాయమూర్తి దినేశ్ కుమార్ సింగ్ కేరళ నుంచి కర్ణాటక కు, న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ చెన్నై నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ, న్యాయమూర్తి బట్టు దేవానంద్ చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ, న్యాయమూర్తి ఓం ప్రకాష్ శుక్లా అలహాబాదు నుంచి ఢిల్లీ కి బదిలీ న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్ రాజస్థాన్ నుంచి బాంబే కు బదిలీ, న్యాయమూర్తి సుధీర్ సింగ్ పంజాబ్ & హర్యానా నుంచి పట్నా కు బదిలీ..
Also Read:HCA: హెచ్‌సీఏ అక్రమాలపై విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు…
న్యాయమూర్తి అనిల్ ఖేతర్పాల్ పంజాబ్ & హర్యానా నుంచి ఢిల్లీ కి బదిలీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మోంగా రాజస్థాన్ నుండి ఢిల్లీ కి, న్యాయమూర్తి జయంత్ బెనర్జీ అలహాబాదు నుంచి కర్ణాటక కు బదిలీ, న్యాయమూర్తి సి. సుమలత కర్ణాటక నుంచి తెలంగాణ కు బదిలీ, న్యాయమూర్తి లలిత కన్నెగంటి కర్ణాటక నుంచి తెలంగాణ కు బదిలీ, న్యాయమూర్తి అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి పట్నా నుంచి తెలంగాణ కు బదిలీ చెయ్యాలని కొలీజియం సూచించింది.