Tspsc paper leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.
Read also: TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టు తీర్పు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్ 5కి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ స్టేటస్ రిపోర్టును ఈ ఏడాది జూన్ 5లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు పేర్కొంది. పేపర్ లీక్ కేసులో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పరీక్షలు రాశారు. ఎంత మంది ఉద్యోగులు అనుమతి తీసుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసిన ఎంత మంది ఉద్యోగులను విచారించారని సిట్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఏ – 16 ప్రశాంత్ రోల్ ఎంటని ప్రశ్నించింది. దాక్యా నుండి డబ్బులు పెట్టీ పేపర్ కొన్న వాళ్ళు మళ్ళీ ఎవరికైనా అమ్మారా? అని ప్రశ్నించింది. కాగా.. ఈ కేసులో ఏ1 నిందితుడు అనుమతి తీసుకున్నట్లు సిట్ బృందం సభ్యుడు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు చాలా సున్నితమైనదని చెబుతూనే.. ఈ సమయంలో ఉత్తర్వులు జారీ చేస్తే.. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే కష్టమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా.. అదే రోజున ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
PM Modi: రామగుండం రిలే స్టేషన్.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని