తెలుగు పాఠ్య పుస్తకం లో ముందుమాట మార్చకపోవడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Warangal Airport: తెలంగాణలోని వరంగల్‌లో ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం..
రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు.
Telangana: ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాలే కాదు, విద్యాసంస్థలు పూర్తిగా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. శ్రీరాముడి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది.
మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ఈ శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు.
అన్ని ప్రభుత్వ స్కూల్స్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.