కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు.
Ambati Rayudu declines BRS MLA Padi Kaushik Reddy’s Request: షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ కేబినెట్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతేకాదు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు…
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పింఛన్ అందించనుంది. అందుకు సంబంధించి సర్కార్ జీవో జారీ చేసింది. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
Datathon Conference on ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించనున్నాయి. బుధవారం (జులై 10) ‘డేటాథాన్’ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ఓ ప్రకటలో తెలిపింది. వచ్చే సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్‌ఓజోన్‌టెల్, డిజిక్వాంట, టెక్‌వేదిక సంస్థలు…
హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఆశిస్తున్న నిరుద్యోగ యువత బీఆర్ఎస్ కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తమను రెచ్చగొట్టి హామీలు ఇచ్చిందని నిరుద్యోగులు అంటున్నారు.
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు.