Ramoji Rao: నేడు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramoji Rao: నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీ అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆది, సోమవారాలను ఏపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే రామోజీ మృతికి నివాళిగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయించింది.
Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్
రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఎల్‌బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పరిశీలించారు. రామోజీరావు అంత్యక్రియలకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
రామోజీరావు అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్స్ సిటీ ప్రతినిధులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం చంద్రబాబు, చిరంజీవి, పవన్‌లయన్, లోకేష్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితర ప్రముఖులు రామోజీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ్‌లను ఏపీ ప్రభుత్వం పంపుతోంది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!