Rythu Runa Mafi: రూ. 2లక్షల రుణమాఫీపై బిగ్ అలర్ట్.. కేవలం వారికి మాత్రమే వర్తింపు..!
- రూ. 2లక్షల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
- ఆదాయ పన్ను.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కట్..
- మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు. పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఉద్యోగులకు దీని నుంచి మినహాయించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో మరోసారి భేటీ కావాలని సర్కార్ చూస్తుంది. రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించాలని ఇప్పటికే వ్యవసాయాధికారులకు ప్రభుత్వం తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరే ఛాన్స్ ఉంది.
Read Also: Father Killed Daughter : రూ.600కోసం కన్న కూతురిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన తండ్రి
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
కాగా, రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు.. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది.. వారందరికీ రేషన్ కార్డుల్లేవు.. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది.. రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే ఛాన్స్ అవకాశం ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో కేవలం 40 లక్షల మంది వరకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు అందుతున్నాయి.. రుణమాఫీ కోసం ఈ పథకం విధివిధానాల మీదా చర్చ కొనసాగుతుంది.
Read Also: Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటే..?
ఇక, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు తెలిపారు. దీనికి రేవంత్ ప్రభుత్వం విముఖత చూపింది.. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్ అయిన వాటికి రుణమాఫీ అమలు చేయాలని చూస్తుంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని పేర్కొనింది. అలాగే, రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు వచ్చినప్పటికి.. దీనిపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ అమలు చేసే క్రమంలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!