సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇవాళ కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి.. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ఓ వైపు అరెస్ట్‌లు చేస్తుంటే.. మరోవైపు దిద్దిబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు వేసింది.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డైరెక్టర్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్ )గా ఉన్న సోమిరెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించింది ప్రభుత్వం.. ఇక, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా అదనపు…
గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేషాలతో ఇక్కడికి వచ్చాను అని చెప్పిన ఆయన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంది. ఆయన మొదటి దశ యాత్ర అక్టోబర్ 2న ముగుస్తది. గ్రామాలకు తరలి వెల్లండి అని చెప్పిన గాంధి జయంతి రోజున ముగుస్తుంది. ఏ ఇతర పార్టీల నేతలు గ్రామాలకు వెల్లడం లేదు.. కేసీఆర్…
అధికారపార్టీలో ఎమ్మెల్యేల జోడు పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వరసగా ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టడంతో.. ఇతరులకు లైన్ క్లియరైనట్టేనా? ఆశలు వదిలేసుకున్నవారు మళ్లీ హుషారుగా ఎదురు చూస్తున్నారా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్యేలలో పదవులపై ఆశలు టీఆర్ఎస్లో కొంత కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవుల పొందిన వారిలో కొందరికి రెన్యువల్ అయితే.. కొత్త వాళ్లలో మరికొందరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్…
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. అయితే, దీనికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు.. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని.. జల్లికట్టు, శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు.. ఇక, రాష్ట్ర సర్కారు…
గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశామని ఆయన వివరించారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని… హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని… హుస్సేన్ సాగర్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్…
తెలంగాణలో ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 220 పనిదినాలతో…. రెండు టర్మ్‌లుగా అకడమిక్ ఇయర్ ఉంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 18 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది వందశాతం…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్మెంట్పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…
దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల…